- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెంకటాపురం(నూగూరు): జలపాతం చూడాలనే సరదా యువకుడి ప్రాణం తీసింది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని అరుణాచలపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న గుండం జలపాతానికి హైదరాబాద్‌కి చెందిన అక్తరుద్దీన్(25) అనే వ్యక్తి తన స్నేహితులతో వచ్చారు. ప్రమాదవశాత్తు అందులో పడి మునిగి పోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని వెలికి తీసి 108 వాహనంలో ఏటూరునాగారం వైద్యశాలకు తరలించారు. నిషేధంలో ఉన్న గుండం జలపాతం కాబట్టి అటవీశాఖ అధికారులు అక్కడ పహారా కాస్తున్నారు. కానీ అక్కడికి అధికారులు రాకముందే తెల్లవారుజామున జలపాతం వద్దకు యువకులు చేరుకున్నట్లు స్థానికులు తెలిపారు.
Next Story






