HYD: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-23 12:18:46  IST  )

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

HYD: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
X

Jubilee Hills Police Station జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్(Jubilee Hills Police Station) వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విచారణ నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు భారీగా పీఎస్ వద్దకు చేరుకున్నారు. వారిని అదుపుచేయలేక పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేటీఆర్ విచారణ ముగియకపోవడంతో బీఆర్ఎస్ మహిళా నేతలు స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు వాగ్వాదం జరిగింది. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) పేరుతో బీఆర్ఎస్ నేతలను వేధించడం కక్షపూరిత చర్య అని, రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధికార పార్టీ కావాలనే విచారణ పేరుతో వేధిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాగా, రెండ్రోజుల క్రితమే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావును సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. తాజాగా కేటీఆర్ విచారణ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.

Read More... కేటీఆర్‌పై డీజీపీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ.. ఎందుకంటే..?

సొంత బావ ఫోన్ టాప్ చేసిన దుర్మార్గుడు కేటీఆర్

Next Story