Samsung: శాంసంగ్ ఉద్యోగాల కోత

by S Gopi |

టెక్సాస్‌కు మారలేని కొందరిని తొలగించడంతో పాటు, ప్లానో మొబైల్ విభాగంలో మరో 100 మందిపై వేటు వేసింది.

Samsung: శాంసంగ్ ఉద్యోగాల కోత
X

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ టెక్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అమెరికాలో తన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ (మొబైల్, డిస్‌ప్లే, టీవీ) విభాగాలను పునర్వ్యవస్థీకరించే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా న్యూజెర్సీలోని తన ప్రధాన కార్యాలయాన్ని టెక్సాస్‌కు తరలిస్తూ.. దాదాపు 739 ఉద్యోగాలను తొలగించనుంది. టెక్సాస్‌కు మారలేని కొందరిని తొలగించడంతో పాటు, ప్లానో మొబైల్ విభాగంలో మరో 100 మందిపై వేటు వేసింది. యాపిల్ నుండి వస్తున్న తీవ్రమైన పోటీ, చైనా కంపెనీల దూకుడు కారణంగా సంప్రదాయ గృహోపకరణాల విభాగంలో ఒత్తిడి పెరుగుతుండటంతో.. అధిక లాభాలు తెచ్చిపెట్టే ఏఐ చిప్‌ల వ్యాపారం వైపు మళ్లించేందుకే శాంసంగ్ ఈ మార్పులు చేస్తోంది. మైక్రోసాఫ్ట్, మెటా తరహాలోనే ఏఐ ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం శాంసంగ్ కూడా గ్లోబల్ ట్రెండ్‌ను అనుసరిస్తోంది. అమెరికాలో జరుగుతున్న ఈ పరిణామాలు భారతీయ ఉద్యోగులలో కొంత ఆందోళన రేపినప్పటికీ, ప్రస్తుతానికి వీరికి పెద్దగా ఎలాంటి ముప్పు లేదని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ లే-ఆఫ్స్ కేవలం అమెరికా ఆఫీస్ లొకేషన్ మార్పు, అక్కడి స్థానిక వ్యాపార అవసరాలకు అనుగుణంగా చేసినవి మాత్రమేనని శాంసంగ్ వెల్లడించింది.

Next Story