- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిఫా వరల్డ్ కప్ 2026.. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన మరో రాష్ట్ర ప్రభుత్వం
ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ను చూసేందుకు యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ను చూసేందుకు యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్థరాత్రి 12 గంటల తర్వాత మ్యాచ్ ప్రారంభం కానుండగా.. అర్జెంటీనా - స్పెయిన్ జట్లు తీవ్రంగా తలపడనున్నాయి. కాగా.. ఈ మ్యాచ్ ను చూసేందుకు అవకాశమివ్వాలని కేరళ విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా.. వారి విజ్ఞప్తి మేరకు కేరళ సర్కార్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాక మ్యాచ్ సమయంలో కరెంట్ కట్ అవ్వకుండా చూసుకుంటామని మంత్రి సన్నీ జోసెఫ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.
తాజాగా మణిపుర్ ప్రభుత్వం కూడా సోమవారం రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ కాలేజీలు, ఉన్నత విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు అన్నింటికీ సెలవు ఇస్తున్నట్లు తెలిపింది. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను విద్యార్థులంతా ఆస్వాదించి చూసేందుకే ఈ సెలవు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.






