ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం.. సీఎం ఉన్నత స్థాయి సమీక్ష

by Vemula.Srinu Prasad |

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు...

ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం.. సీఎం ఉన్నత స్థాయి సమీక్ష
X

దిశ, వెబ్ డెస్క్: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడతో పాటు రాష్ట్ర మంత్రులు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఏవియేషన్ శాఖ అధికారులు, ఎయిర్ పోర్టు నిర్మించిన జిఎంఆర్ సంస్థ ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా మారుతుందని తెలిపారు. ఆ ప్రాంత రూపురేఖలను, స్థితిగతులను ఈ ఎయిర్ పోర్టు పూర్తిగా మార్చేస్తుందని సీఎం చంద్రబాబు దీమా వ్యక్తం చేశారు. ఆగస్టు 1న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును ప్రధాని మోడీ ప్రారంభించనున్నారని చంద్రబాబు వెల్లడించారు. ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి పథంలో దూసుకుపోనుందని చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story