- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మెదక్ > కుమ్మర్ల బోనాల పండుగలో పాల్గొన్న డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి
కుమ్మర్ల బోనాల పండుగలో పాల్గొన్న డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి
by Taduka Kalyani |
ఆషాడ మాసం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి. ఆనవాయితీగా ఎఫ్ ఆర్ఎస్ ఎల్లమ్మ తల్లికి కుమ్మర్లు తొలి బోనం సమర్పించారు.

X
దిశ, సంగారెడ్డి : ఆషాడ మాసం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి. ఆనవాయితీగా ఎఫ్ ఆర్ఎస్ ఎల్లమ్మ తల్లికి కుమ్మర్లు తొలి బోనం సమర్పించారు. ఐబి నుంచి మొదలుకుని ఎల్లమ్మ గుడి వరకు బోనాలను ఊరేగించారు. డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఈ బోనాల ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఆషాడ మాసం అత్యంత పవిత్రమైన మాసం అన్నారు. ఆశాడ మాసం సందర్భంగా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించడం తరతరాలుగా వస్తున్న ఆచారం అన్నారు. ఈ కార్యక్రమంలో టీపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, కౌన్సిలర్ లు శైలేష్ రెడ్డి, కృష్ణ, అశ్విన్, కాంగ్రెస్ నాయకుడు శ్రీశైలం, కుమ్మరి సంఘం పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.
Next Story






