- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్‌పై డీజీపీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ.. ఎందుకంటే..?
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా అధికారులను బెదిరించారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్ డీజీపీకి ఫిర్యాదు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా అధికారులను బెదిరించారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. విచారణ అధికారులను భయబ్రాంతులకు గురి చేసేలా వీరిద్దరూ మాట్లాడారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ అధికారులు దర్యాప్తు చేపట్టిన నేపథ్యంలో, విచారణకు హాజరైన సమయంలో కేటీఆర్, హరీశ్‌రావులు అధికారులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారని ఎమ్మెల్సీ ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దర్యాప్తు సంస్థలను బెదిరించడం తీవ్ర నేరమని, వెంటనే తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.
కేసు నమోదై దాదాపు రెండేళ్లు!
ఇదిలా ఉండగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం సిట్ విచారణకు హాజరయ్యారు. గురువారం సిట్ అధికారులు జారీ చేసిన నోటీసుల మేరకు జూబ్లీహిల్స్‌లోని ఏసీపీ కార్యాలయానికి ఆయన వెళ్లి విచారణలో పాల్గొన్నారు. ఇదే కేసులో ఈ నెల 20న మాజీ మంత్రి హరీశ్‌రావును ఇప్పటికే విచారించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్‌ఐబీ కేంద్రంగా అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ 2024 మార్చిలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసును విచారిస్తోంది. కేసు నమోదై దాదాపు రెండేళ్లు గడుస్తున్నప్పటికీ దర్యాప్తు ఇంకా కొనసాగుతుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.






