- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సొంత బావ ఫోన్ టాప్ చేసిన దుర్మార్గుడు కేటీఆర్
సొంత బావ ఫోన్ నే టాప్ చేసిన దుర్మార్గుడు కేటీఆర్ అని, ఈ విషయాన్ని తన సొంత చెల్లెలే చెప్పిందని ఎమ్మెల్యే వేముల వీరేశం గుర్తు చేశారు.

దిశ, నకిరేకల్ : సొంత బావ ఫోన్ నే టాప్ చేసిన దుర్మార్గుడు కేటీఆర్ అని, ఈ విషయాన్ని తన సొంత చెల్లెలే చెప్పిందని ఎమ్మెల్యే వేముల వీరేశం గుర్తు చేశారు. ఫోన్ టాపింగ్ కేసులో నిందితుడిగా నిలబడాల్సిందేనన్నారు. సిట్ విచారణకు హాజరవుతున్న కేటీఆర్ తానేదో గొప్పోడిగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. 1885 యాక్ట్ ప్రకారం దేశభద్రతకు ముప్పు కలిగించినప్పుడు మాత్రమే టాపింగ్ చేయాల్సిన చట్టాన్ని విరుద్ధంగా వాడిన కేటీఆర్ ముమ్మాటికి నేరస్తుడే అని మండిపడ్డారు. 6000 మంది ఫోన్లను టాప్ చేసిన వ్యక్తి కేటీఆర్ అన్నారు. సిట్ విచారణ అనంతరం కటకటాల్లోకి వెళ్లాల్సిందేనని తెలిపారు. చట్టం ముందు ఎంతటి వారైనా దోషులుగా నిలడాల్సిందే అన్నారు. చేసిందంతా చేసి పైగా తామేదో గొప్పోళ్ళం అన్నట్లుగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని, వారికి తగిన బుద్ధి తప్పదని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. తప్పును తప్పించుకునేందుకు సీటును తప్పు పట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు.
Read More... కేటీఆర్‌పై డీజీపీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ.. ఎందుకంటే..?






