డీఏపీ కొరతను ఆసరాగా చేసుకొని అధిక ధరలకు విక్రయం

by Jakkula.Mamatha |

నాగారం మండలంలోని పలు ఫెర్టిలైజర్ షాప్ యాజమాన్యాలు ఎరువులను ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని నాగారం బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య శనివారం ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో అన్నారు.

డీఏపీ కొరతను ఆసరాగా చేసుకొని అధిక ధరలకు విక్రయం
X

దిశ,నాగారం: నాగారం మండలంలోని పలు ఫెర్టిలైజర్ షాప్ యాజమాన్యాలు ఎరువులను ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని నాగారం బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య శనివారం ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ డీఏపీ ఎంఆర్పి ధర రూ.1350 కాగా రూ.1800 నుంచి రూ.1850 వరకు ఎక్కువ ధరకు రైతులకు విక్రయిస్తున్నారని అధికంగా రైతుల వద్ద వసూలు చేస్తున్నారని అన్నారు.

మండలంలో అధికారులు ఫెర్టిలైజర్ షాపుల యాజమాన్యం కుమ్మక్కయి రైతుల వద్ద నుంచి ఒక్కో బస్తాకు 450 నుంచి 500 అధికంగా వసూలు చేస్తున్నారని అన్ని తెలిసినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని తెలిపారు. అధికారులు పట్టించుకోకపోవడం వెనుక అంతర్యం ఏమిటని అన్నారు. డీఏపీ కొరతను ఆసరాగా చేసుకుని అధిక వసూళ్లకు పాల్పడుతున్న ఫెర్టిలైజర్ షాప్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారి కార్యాలయానికి తాళం వేసి రైతుల పక్షాన నిరసన వ్యక్తం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు గుండగాని అంబయ్య, చిల్లర చంద్రమౌళి, కన్నెబోయిన మల్లేష్, తిగుళ్ల ప్రశాంత్, చిరంజీవి, మహేందర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Next Story