- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాధితులకు అపన్న హస్తం అందించాలి: ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి
తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు దాతలు అపన్న హస్తం అందించాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి పిలుపునిచ్చారు.

దిశ, హాలియా : తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు దాతలు అపన్న హస్తం అందించాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి పిలుపునిచ్చారు. తలసేమియా బాధితుల సహాయార్థం గరుడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హాలియాలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు, స్వచ్ఛంద రక్తదాతలు రక్తదానం చేసి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశంలో తలసేమియా వ్యాధితో ఏటా వేలాది మంది చిన్నారులు, కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అలాంటి బాధితులకు అండగా నిలిచేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న రక్తదాతలు, సేవా సంస్థలు అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న గంగుల శివ నాగరాజుకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం అందజేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములై అవసరమైన వారికి తోడ్పాటు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రావుల శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ యాదవ్, కౌన్సిలర్లు చెరుపల్లి ముత్యాలు, నకిరేకంటి సైదులు, మజాహర్ ఫౌండేషన్ ప్రతినిధులు, గరుడ ఫౌండేషన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, రక్తదాతలు పాల్గొన్నారు.






