- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒంటికి నిప్పంటించుకొని మహిళ ఆత్మహత్య
ఒంటికి నిప్పంటించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళ మృతి చెందిన సంఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది.

దిశ, శంషాబాద్: ఒంటికి నిప్పంటించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళ మృతి చెందిన సంఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామ పంచాయతీ పరిధిలోని మేకలబండ తండాకు చెందిన కడావత్ శాంతి (48) అనారోగ్యంతో బాధపడుతోంది.. ఆమెకు రక్తపోటు (బీపీ) సమస్య ఉండడంతో పాటు మానసిక ఆందోళనకు గురవుతూ అసహజంగా ప్రవర్తించేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 15వ తేదీ ఉదయం సుమారు 9 గంటల సమయంలో ఇంటి వద్ద బట్టలు ఉతుకుతూ ఏడుస్తూ ఉండగా, కుటుంబ సభ్యులు ఆమెను ఇంట్లోకి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని చెప్పి పంపించారు. కొద్దిసేపటికే ఇంట్లో ఉన్న పెట్రోల్‌ను తన ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. మంటల్లో చిక్కుకుని కేకలు వేస్తూ బయటకు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే మంటలను ఆర్పి, 108 అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి కుమారుడు కడావత్ జగన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శంషాబాద్ పోలీసులు అనుమానాస్పద మృతి (యూడీ) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనారోగ్యం కారణంగా జీవితంపై మనస్తాపం చెంది ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.






