లార్ట్స్ వేదిక వ‌న్డే..హాజ‌రైన ధోని, యువ‌రాజ్

by velandi.Saikiran |

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న చివరి వన్డే నేపథ్యంలో దిగ్గజ మాజీ క్రికెటర్లు లార్డ్స్ స్టేడియానికి వచ్చారు.

లార్ట్స్ వేదిక వ‌న్డే..హాజ‌రైన ధోని, యువ‌రాజ్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇండియా, ఇంగ్లాండ్ మధ్య కాసేపటి క్రితమే లార్డ్స్ వన్డే ప్రారంభమైంది. ఇందులో టాస్ ఓడిపోయిన భారత్, మొదట బౌలింగ్ చేస్తోంది. బుమ్రా లేకపోవడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తున్నారు. అయితే, లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మూడో వన్డే నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్ లో నల్ల బ్యాడ్జీలు ధరించి, సర్ గార్ఫీల్డ్ సోబర్స్ కు క్రికెటర్లు నివాళులు అర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం కూడా పాటించారు. అంతేకాదు ఈ మ్యాచ్ నేపథ్యంలో యువరాజు సింగ్ బెల్ మోగించి, అరుదైన గౌర‌వం ద‌క్కించుకున్నాడు.

లార్డ్స్ వన్డేకు దిగ్గజాల రాక‌

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న చివరి వన్డే నేపథ్యంలో దిగ్గజ మాజీ క్రికెటర్లు లార్డ్స్ స్టేడియానికి వచ్చారు. సునీల్ గవాస్కర్, యువరాజ్ సింగ్, కుమార సంగక్కర, బ్రియాన్ లారా, మహేంద్ర సింగ్ ధోని దంపతులు స్టేడియంలో మెరిశారు. వీళ్లకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. దిగ్గజ క్రికెటర్లు వచ్చిన నేపథ్యంలో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

Next Story