మానోపాడులో వరుణుడి కోసం ముస్లింల ప్రత్యేక నమాజ్

by Jakkula.Mamatha |

గద్వాల జిల్లా మానోపాడు మండల కేంద్రంలో ముస్లిం సోదరులు వినూత్నంగా ప్రార్థనలు నిర్వహించారు.

మానోపాడులో వరుణుడి కోసం ముస్లింల ప్రత్యేక నమాజ్
X

దిశ, అలంపూర్: గద్వాల జిల్లా మానోపాడు మండల కేంద్రంలో ముస్లిం సోదరులు వినూత్నంగా ప్రార్థనలు నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమైనా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, కరువు పరిస్థితులు నెలకొనడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. వరుణ దేవుడు కరుణించి సకాలంలో వర్షాలు పడాలని, కరువు కాటకాలు తొలగిపోవాలని కోరుకుంటూ ఓ రైతు పొలంలో ప్రత్యేక నమాజ్ (ఇస్తిస్కా) చేశారు. ఇందుకోసం ముస్లిం సమాజం అంతా కలిసి దాదాపు రెండు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లారు. చేనులో పరదాలు పరిచి, భక్తిశ్రద్ధలతో నమాజ్ పూర్తి చేసి, సమృద్ధిగా వర్షాలు పడి పంటలు పండాలని అల్లాను వేడుకుంటూ ప్రత్యేక దువా చేశారు. రాష్ట్రం మొత్తం సుఖశాంతులతో కలిసి ఉండే విధంగా వర్షం కురిపించి ఆదుకోవాలని కోరుకున్నారు.

Next Story