- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులే లక్ష్యం
గొందిగూడెంలోని బాలుర ఆశ్రమ పాఠశాలలో రూ.2.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల భవనానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు.

దిశ, అశ్వాపురం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెంలోని బాలుర ఆశ్రమ పాఠశాలలో రూ.2.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల భవనానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదివారం శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆశ్రమ పాఠశాలల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి విద్యార్థులు ఉత్తమ విద్యను అభ్యసించే వాతావరణాన్ని సృష్టిస్తున్నామని పేర్కొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పినపాక నియోజకవర్గంలో విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సబ్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీఓ), డీసీసీ జిల్లా అధ్యక్షురాలు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






