- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల గదుల కేటాయింపులో మార్పులు..ఇకపై కొత్త రూల్స్
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. రూముల కేటాయింపుల్లో మార్పులు చేసింది టీటీడీ.

దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. రూముల కేటాయింపుల్లో మార్పులు చేసింది టీటీడీ. తిరుమలలో గదుల కేటాయింపు విషయంలో భక్తులు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రూముల కేటాయింపులో కీలక మార్పులు చేస్తూ టీటీడీ కొత్త విధానాన్ని తెరపైకి తీసుకువచ్చింది. రూముల కోసం సీఆర్ఓ ఆఫీస్ వద్ద గంటలకొద్దీ వేచి చూడకుండా తాజాగా కీలక మార్పులు చేసింది. ఇకపై గదుల కోసం మొదట సీఆర్ఓ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొంది. ఆ తర్వాత డిస్ ప్లే బోర్డులో భక్తుల రిజిస్ట్రేషన్ నంబర్ కనిపిస్తే, 15 నిమిషాలలో ఫోన్ కు వివరాలు వస్తాయని తెలిపింది.
ఒకవేళ మెసేజ్ రాకపోతే కియోస్క్ మిషన్ ద్వారా తీసుకోవచ్చు. ఆ తర్వాత తిరుమల కొండపై ఉండే 18 సబ్ ఎంక్వైరీ ఆఫీసులలో పేమెంట్ చేసి, రూమ్ తాళాలు తీసుకోవచ్చు. ఫోన్ పే, గూగుల్ పే, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా మాత్రమే చెల్లింపు చేసి గది తాళాలు తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త విధానం ప్రకారం రూ.50, రూ.100, రూ.1000ల రూములు అందుబాటులో తీసుకొచ్చింది టీటీడీ. అలాగే నెలలో ఒక్క భక్తుడికి ఒకేసారి రూమ్ కేటాయిస్తారు. 21 సంవత్సరాలు నిండిన వాళ్లకు మాత్రమే గదులు కేటాయిస్తారు. ఒంటరి వ్యక్తులు లేదా పెళ్లి కాని వాళ్లకు గదులు కేటాయించబోరు. ఇక ఒక రూమ్ 24 గంటల పాటు చెల్లుబాటు అవుతుంది. గడువు దాటితే అదనపు ఛార్జీలు వేస్తారు. టీటీడీ కేటాయించిన గదులలో నీరు కరెంటు పొదుపుగా వాడాలి. ప్లాస్టిక్ బాటిల్స్ అస్సలు వినియోగించకూడదని రూల్స్ పెట్టింది టీటీడీ.






