జనగామలో లాడ్జీల పై పోలీసుల ఆకస్మిక తనిఖీలు..

by Batti.Sumithra |

ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న ఆస్తి నేరాలు, గొలుసు లాక్కునే (చైన్ స్నాచింగ్) ఘటనల నేపథ్యంలో జనగామ పోలీసులు అప్రమత్తమయ్యారు.

జనగామలో లాడ్జీల పై పోలీసుల ఆకస్మిక తనిఖీలు..
X

దిశ, జనగామ : ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న ఆస్తి నేరాలు, గొలుసు లాక్కునే (చైన్ స్నాచింగ్) ఘటనల నేపథ్యంలో జనగామ పోలీసులు అప్రమత్తమయ్యారు. జనగామ డీసీపీ రాజమహేందర్ నాయక్ ఆదేశాల మేరకు సీఐ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ రతీష్, ఎస్‌ఐ చెన్నకేశులు పోలీసు బృందాలతో కలిసి పట్టణంలోని అన్ని లాడ్జీలలో ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా లాడ్జీలలో బస చేస్తున్న ప్రతి వ్యక్తి ఆధార్ కార్డులను పరిశీలించి వారి గుర్తింపును ధృవీకరించారు.

ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తుల వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, వారి బసకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా లాడ్జి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. లాడ్జీలలో బస చేసే ప్రతి అతిథి పూర్తివివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, సరైన గుర్తింపు పత్రాలు లేకుండా ఎవరికి గదులు కేటాయించవద్దని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, నేరాలకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆదేశించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా నివారణ పోలీసింగ్ చర్యలను మరింత ముమ్మరం చేస్తున్నామని, నేరాల నియంత్రణ కోసం ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

Next Story