- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎట్టకేలకు రిటైర్మెంట్ వార్తలపై స్పందించిన రోహిత్ శర్మ
సోషల్ మీడియాలో వస్తున్న రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ మొదటి సారి స్పందించారు.

దిశ, వెబ్ డెస్క్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఈ రోజు ఇంగ్లాండ్ తో జరిగే మూడో వన్డే తర్వాత రిటైర్మెంట్ (Retirement) తీసుకుంటున్నట్లు అనేక వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరగబోయే కీలకమైన మూడో వన్డేకు ముందు.. టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ వన్డే రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలు తీవ్ర కలకలం రేపాయి. కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో రోహిత్ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో, 2027 వన్డే ప్రపంచకప్‌కు ముందే సెలెక్టర్లు అతనికి గుడ్‌బై చెప్పబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి. ఈ నేపథ్యంలో తన వన్డే భవిష్యత్తు, రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలపై రోహిత్ శర్మ తొలిసారిగా పరోక్షంగా స్పందించాడు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో రోహిత్ శర్మ, భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్‌తో మాట్లాడుతూ తన రిటైర్మెంట్ ప్రచారాలను పూర్తిగా కొట్టిపారేశాడు. బయట జరుగుతున్న ప్రచారాలపై స్పందిస్తూ హిందీలో.. "బహర్ క్యా చల్ రహా హై ఉస్సే హమారా క్యా లేనా దేనా" (బయట ఏం జరుగుతుందో దాంతో నాకేం సంబంధం) అంటూ వ్యాఖ్యానించాడు. ఈ ఒక్క మాటతో జట్టు వెలుపల జరిగే అనవసర ప్రచారాలను తాము అస్సలు పట్టించుకోమని రోహిత్ తేల్చి చెప్పగా.. హిట్‌మ్యాన్ కచ్చితంగా 2027 వన్డే ప్రపంచకప్ ఆడుతాడని అభిమానులు సోషల్ మీడియాలో ధీమా వ్యక్తం చేస్తున్నారు.






