- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన బీజేపీ..
దేశంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్షణమే రాజీనామా చేయాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు సుప్రీంకోర్టు న్యాయవాది కృష్ణ స్వరూప్ డిమాండ్ చేశారు.

దిశ, హిమాయత్ నగర్: దేశంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్షణమే రాజీనామా చేయాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు సుప్రీంకోర్టు న్యాయవాది కృష్ణ స్వరూప్ డిమాండ్ చేశారు. ఆదివారం హిమాయత్ నగర్ ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల ఆయన మాట్లాడుతూ, 2014 నుండి నేటి వరకు దేశంలో జాతీయ స్థాయిలో జరిగిన అన్ని పరీక్షల నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని ఆరోపించారు. ఇటీవల జరిగిన నీట్ పరీక్ష, సీబీఎస్ఈలో జరిగిన అవినీతి అక్రమాలు పాల్పడ్డారని బాధ్యత వహించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ నేతృత్వంలో జరిగిన పరీక్ష లీకేజీలపై ఢిల్లీలో కేంద్రంగా జనతా కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా పోరాటాలకు దళిత బహుజన పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందన్నారు. విదేశీ శక్తుల నుండి ప్రమాదం లేదని, ఆర్ఎస్ఎస్ బిజెపితోనే అత్యంత ప్రమాదమని హెచ్చరించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బహిరంగంగా హెచ్చరిస్తున్నారని, ప్రజా వోట్తో కాకుండా ఈవీఎంల ట్యాంపరింగ్ తో పార్లమెంటును కబ్జా చేశారని ఆరోపించారు. మోడీ, షా ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా సోమవారం నాడు కాక్రోచ్ జనతా పార్టీ, ఇతర ప్రజాస్వామిక శక్తుల సోషలిస్ట్, కమ్యూనిస్టు విప్లవ శక్తుల ఆధ్వర్యంలో నిర్వహించే చలో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమానికి దళిత బహుజన పార్టీ శ్రేణులు పాల్గొంటారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ బి.ధర్మరాజుగౌడ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి మోహన్ రావు, దళిత బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ గణేష్, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.






