- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాగ్నెటిక్ నానోటెక్నాలజీ.. ఆ రంగంలో మార్పులు తేనుందా?
దంతవైద్యం, నానోటెక్నాలజీ మధ్య ఉన్న సరిహద్దు అద్భుతంగా మిళితమవుతోందని నిపుణులు అంటున్నారు.

దిశ, ఫీచర్స్ : మోడర్న్ టెక్నాలజీ రోజు రోజుకూ విస్తరిస్తోంది. అనేక రంగాల్లో సేవలను సులభతరం చేస్తోంది. అలాంటి వాటిలో మాగ్నెటిక్ నానో టెక్నాలజీ కూడా ఒకటి. ఇటీవల దంత వైద్య చికిత్సల్లో దీన్ని ఎలా వర్తింపజేయాలనే అంశంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), బెంగళూరులోని Centre for Nano Science and Engineering (CeNSE) శాస్త్రవేత్తలు మాగ్నెటిక్ నానోబాట్లను అభివృద్ధి చేశారు. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
డెంటిస్ట్రీలో కీ రోల్
దంతవైద్యం (Dentistry), నానోటెక్నాలజీ మధ్య ఉన్న సరిహద్దు అద్భుతంగా మిళితమవుతోందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా భారతీయ పరిశోధకులు మాగ్నెటిక్ నానోబాట్స్ (CalBots)ను ప్రవేశపెట్టడం ద్వారా దంత చికిత్సల్లో కొత్త అధ్యాయం మొదలైంది. ఈ నానోబాట్స్ మానవ వెంట్రుక వ్యాసార్థం కంటే వేల రెట్లు చిన్నవి. అవి మైక్రోస్కోపిక్ సైనికుల్లా పని చేసి, దంతాల ఎనామెల్ పొర గుండా చొచ్చుకొని డెంటినల్ ట్యూబ్యూల్స్ (నొప్పి సంకేతాలు పంపే చిన్న గొట్టాలు)లోకి సులభంగా ప్రవేశిస్తాయి.
మాగ్నెటిక్ నియంత్రణ
నానోబాట్స్‌ను మాగ్నెటిక్ ఫీల్డ్స్ ద్వారా ఖచ్చితంగా నియంత్రించవచ్చు. దంతం లోపలి.. లోతైన ప్రాంతాల్లోకి ఈ చిన్న రోబోట్ల సమూహాన్ని పంపి చికిత్స చేయవచ్చు. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత ఇవి దెబ్బతిన్న ట్యూబ్యూల్స్ గోడలను రిపేర్ చేసి, కొత్త కణజాలాలను పునరుత్పత్తి చేస్తాయి. నిర్దిష్ట అయనాలు లేదా బయోకాంపాటబుల్ పదార్థాలను విడుదల చేసి ఓపెన్ పోర్స్‌లను మూసేసి, నొప్పి సంకేతాలకు సహజ రక్షణ కల్పిస్తాయి.
ప్రయోజనాలు
ఈ సాంకేతికత అతి పెద్ద ప్రయోజనం ఏమంటే..ఒకే ట్రీట్మెంట్ సెషన్‌లో చాలా కాలంగా బాధపెడుతున్న టూత్ సెన్సిటివిటీని పూర్తిగా తొలగించవచ్చు. ఇందులో ఎలాంటి శస్త్రచికిత్సా లేదా డ్రిల్లింగ్ అవసరం లేదు. ఎనామెల్ ఏమాత్రం దెబ్బతినదు. బాహ్య మాగ్నెటిక్ ఫీల్డ్ సహాయంతో 20 నిమిషాల్లో 300-500 మైక్రోమీటర్ల లోతు వరకు నానోబాట్స్‌ను పంపవచ్చు. అక్కడ ఇవి స్వయంగా అసెంబుల్ అయి గట్టి ప్లగ్‌లుగా మారి ట్యూబ్యూల్స్‌ను సీల్ చేస్తాయి. ఫలితంగా ఒక్క చికిత్సతోనే దీర్ఘకాలిక ఉపశమనం లభిస్తుంది.






