- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్ కి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్!
తమిళనాడులో అత్యధిక స్థానాలు గెలుచుకొని ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న టీవీకే పార్టీకి గవర్నర్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడులో అత్యధిక స్థానాలు గెలుచుకొని ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న టీవీకే పార్టీకి గవర్నర్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. రెండో రోజు గవర్నర్ రాజేంద్రతో సమావేశం అయిన విజయ్ కి మళ్ళీ నిరాశే ఎదురైనట్టు సమాచారం. 118 మంది ఎమ్మెల్యేల సంతకాలు ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇస్తానని, అలా ఉంటేనే తనవద్దకు రావాలని విజయ్ ని తిప్పి పంపినట్టు వార్తలొస్తున్నాయి. దీంతో తమిళనాడులో రాజకీయ అనిశ్చితి మరింత క్లిష్టంగా మారింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ కి అనుమతి ఇవ్వాలని డీఎంకేతోపాటు, వీసీకే, వామపక్షాలు గవర్నర్ ను కోరుతున్నప్పటికీ.. టీవీకేకు సమ్మతి తెలిపే విషయం మీద ఆ పార్టీలు స్పష్టతనివ్వడం లేదు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ విధించిన గడువు నేటితో ముగియనుండగా.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని జోరుగా చర్చలు నడుస్తున్నాయి. గవర్నర్ వ్యవహారంపై తమిళ ప్రముఖులు, రాజకీయ విమర్శకులు మండిపడుతున్నారు. బీజేపీ అధిష్టానం కావాలనే అడ్డుకుంటోందని విమర్శలు చేస్తున్నారు.
తమిళ రాజకీయాలపై ప్రకాష్ రాజ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. రాజ్యాంగ విరుద్ధమంటూ ఫైర్
టీవీకే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలి.. లేఖ విడుదల చేసిన తమిళనాడు సిపిఐ






