తమిళ రాజకీయాలపై ప్రకాష్ రాజ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. రాజ్యాంగ విరుద్ధమంటూ ఫైర్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-07 08:35:09  IST  )

తమిళనాట నెలకొన్న నాటకీయ రాజకీయ పరిణామాలపై నటుడు ప్రకాష్ రాజ్ ఆసక్తికర పోస్ట్ చేశారు.

తమిళ రాజకీయాలపై ప్రకాష్ రాజ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. రాజ్యాంగ విరుద్ధమంటూ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజకీయ పరిణామాలు రోజురోజుకీ మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ మధ్య గవర్నర్ నిర్ణయం చుట్టూ చర్చలు జోరందుకున్నాయి. ఈ వ్యవహారంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. ప్రజల మద్దతు పొందిన నాయకుడికి అసెంబ్లీలో తన బలం నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మెజారిటీని సభా వేదికపైనే పరీక్షించాలే గానీ, ముందుగానే అడ్డంకులు సృష్టించడం సరైంది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో గవర్నర్ రాజ్యాంగ విరుద్ధ వైఖరిని అవలంబిస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వ ఏర్పాటు దిశగా మద్దతు కూడగట్టే ప్రయత్నాలను వేగవంతం చేసింది. ప్రస్తుతం ఆ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల బలానికి తోడు మిత్రపక్షాల మద్దతును సమీకరించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే కొందరు సభ్యుల మద్దతుతో అవసరమైన సంఖ్యకు దగ్గరైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశంపై గవర్నర్‌తో విజయ్ సమావేశమై తన వాదనలను వినిపించినట్లు సమాచారం. అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ నిర్వహిస్తే తాను మెజారిటీని నిరూపించగలనని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అవసరమైన సంఖ్యాబలం తనకు లభిస్తుందని, సభలోనే తనకు ప్రజాప్రతినిధుల మద్దతు ఎంత ఉందో నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని కోరినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రక్రియలో ఆలస్యం జరిగితే చట్టపరమైన మార్గాలను కూడా పరిశీలించే అవకాశాన్ని పార్టీ కొట్టిపారేయడం లేదు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే దిశగా అడుగులు వేయవచ్చన్న ప్రచారం కూడా సాగుతోంది. దీంతో తమిళనాడు రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇప్పటికే విజయ్ గవర్నర్ ను కలువగా.. సరైన మెజారిటీ లేనిదే ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విజయ్ మరి తనకు కావలసిన ఎమ్మెల్యేల బలాన్ని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తారా ? లేదా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా అన్నది ఆసక్తిగా మారింది.

టీవీకే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలి.. లేఖ విడుదల చేసిన తమిళనాడు సిపిఐ

Next Story