పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడేందుకు మేము రెడీ.. భారత కెప్టెన్ ప్రకటన

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-05 15:57:45  IST  )

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ జట్టు నిరాకరించడంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించారు.

పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడేందుకు మేము రెడీ.. భారత కెప్టెన్ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్‌(T20 World Cup 2026)లో భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ జట్టు నిరాకరించడంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) స్పందించారు. పాకిస్తాన్‌తో ఆడేందుకు మేము సిద్ధం.. పాక్‌తో ఆడబోమని ఏనాడూ తాము చెప్పలేదని స్పష్టం చేశారు. కేవలం పాకిస్తాన్ మాత్రమే పదే పదే మాతో ఆడేందుకు వెనకడుగు వేస్తోందని చెప్పారు. భారత్ - పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌ షెడ్యూల్‌ను డిసైడ్ చేసేది బీసీసీఐ కాదని.. ఐసీసీ డిసైడ్ చేస్తుందని సూర్యకుమార్ యాదవ్ గుర్తుచేశారు. పాకిస్తాన్‌(Pakistan)తో మ్యాచ్‌కు తాము రెడీ.. ఇప్పటికే ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ అయ్యాయని అన్నారు. ఈ మ్యాచ్ కోసం కొలొంబో వెళ్తున్నట్లు చెప్పారు.

జట్టు పరిస్థితి..

సూర్యకుమార్‌ యాదవ్‌ నేతృత్వంలోని ప్రస్తుత భారత జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉంది. టీ20, వన్డే క్రికెట్‌లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2024లో వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న భారత జట్టు నుంచి ఎనిమిది మంది ఆటగాళ్లు 2026 టీ20 ప్రపంచ కప్ జట్టులో ఉన్నారు. అయితే, ఈసారి ఐదుగురు ఆటగాళ్లు తొలిసారి టీ20 ప్రపంచకప్ 2026 ఆడేందుకు సిద్ధమయ్యారు. అభిషేక్ శర్మ, రింకు సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ తొలిసారి టీ20 ప్రపంచ కప్‌లో ఆడనున్నారు. వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్ మినహా, సూర్య, పాండ్యా, దూబే, అర్ష్‌దీప్, కుల్దీప్, బుమ్రా, శాంసన్ సహా మిగిలిన ఆటగాళ్ళు రోహిత్ కెప్టెన్సీలో ప్రపంచ కప్ గెలిచిన జట్టులో భాగమయ్యారు. దీంతో భారత జట్టుపై ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

భార‌త జ‌ట్టుతో మ్యాచ్‌.. పాకిస్తాన్ ప్ర‌ధాని కీల‌క ప్ర‌క‌ట‌న‌

Dale Steyn: అభిషేక్‌, ఇషాన్ లను ఔట్ చేయ‌డం ఎవ‌రి త‌రం కాదు, కానీ ఇలా చేయండి !

Next Story