Dale Steyn: అభిషేక్‌, ఇషాన్ లను ఔట్ చేయ‌డం ఎవ‌రి త‌రం కాదు, కానీ ఇలా చేయండి !

by velandi.Saikiran |

అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ బ్యాటింగ్ సీక్రెట్ చెప్పేసాడు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్.

Dale Steyn: అభిషేక్‌, ఇషాన్ లను ఔట్ చేయ‌డం ఎవ‌రి త‌రం కాదు, కానీ ఇలా చేయండి !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో భారత స్టార్ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ పైన అందరి క‌న్ను పడింది. మొన్న న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ నుంచి అత్యంత ప్రమాద కరంగా ఆడుతున్నారు. అభిషేక్ శర్మ ఒక్కడే అనుకుంటే, ఈ న్యూజిలాండ్ సిరీస్ పుణ్యమా ఇషాన్ కిషన్ కూడా భయంకరంగా మారిపోయాడు. ఇద్దరు క్రికెటర్లు బౌలర్ల పై విరుచుకుపడుతున్నారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఏ మాత్రం బౌలర్లకు అవకాశం ఇవ్వడం లేదు. 15 బంతుల్లోపే అర్థ సెంచరీ చేసేస్తున్నారు. అయితే అలాంటి అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ బ్యాటింగ్ సీక్రెట్ చెప్పేసాడు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్.

అభిషేక్ శర్మ, ఇషాన్ ను ఇలా ఔట్ చేయండి

భారత స్టార్ క్రికెటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఇద్దరినీ ఔట్ చేయడం చాలా కష్టం, వాళ్లు ఇద్దరు చాలా భయంకరంగా బ్యాటింగ్ చేస్తున్నారని దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్ వెల్లడించారు. ఈ టీ20 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ లో మరింత ప్రమాదకరంగా ఆ ఇద్దరు ఆటగాళ్లు ఆడే ఛాన్స్ ఉందని తెలిపారు. అయితే ఈ ఇద్దరు క్రికెటర్లను ఔట్ చేసేందుకు ఒక సీక్రెట్ కూడా బయటపెట్టారు డేల్ స్టెయిన్.

అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లను తొందరగా పెవిలీయ‌న్ కు పంపేందుకు ఫేస్ ఆఫ్ బౌలింగ్ చేయడం ఉత్తమం అన్నారు. వేగాన్ని తగ్గించి బంతి మెల్లగా వేస్తే ఈ ఇద్దరు తొందరగా ఔట్ అవుతారని వివరించారు. అలా కాకుండా వేగంగా బంతులు వేస్తే, బౌలర్లకు నిరాశే ఎదురవుతుందని హెచ్చరించారు. స్లోయ‌ర్ డెలివరీలతో వాళ్లను బోల్తా కొట్టాలని పేర్కొన్నారు.

Next Story