గ్రామపంచాయతీ పనుల ఎంబి ల కోసం అధికారులు లంచం డిమాండ్

by Kodari Anjali |

మండల పరిధిలోని గ్రామపంచాయతీల్లో చేసిన ప్రభుత్వ పనులకు MBలు చేయడానికి కొందరు అధికారులు లంచం అడుగుతున్నారని బాలనగర్ మండల అధికార పార్టీ సర్పంచులు అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు.

గ్రామపంచాయతీ పనుల ఎంబి ల కోసం అధికారులు లంచం డిమాండ్
X

దిశ, జడ్చర్ల/ బాలనగర్: మండల పరిధిలోని గ్రామపంచాయతీల్లో చేసిన ప్రభుత్వ పనులకు MBలు చేయడానికి కొందరు అధికారులు లంచం అడుగుతున్నారని బాలనగర్ మండల అధికార పార్టీ సర్పంచులు మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కుమార్ నాయక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్ నాయక్ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం బాలనగర్‌లో సమావేశమైన మండల సర్పంచులు మాట్లాడుతూ, గ్రామాల్లో ప్రభుత్వ నిధుల ద్వారా వేసిన సీసీ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి పైప్ లైన్లు వంటి ప్రభుత్వ పనులు పూర్తి చేసినా.. MB లు పాస్ చేయడానికి, బిల్లులు విడుదల చేయడానికి కొందరు సంబంధిత అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయాలని సర్పంచ్‌లుగా గెలిచాం. కానీ పనులు చేసిన తర్వాత కూడా అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. లంచం ఇవ్వకుండా ఫైళ్లు ముందుకు కదలడం లేదు అని సర్పంచులు ఆరోపించారు. ఇది ప్రభుత్వ విధానాలకు, సర్పంచుల ప్రతిష్టకు తీవ్రంగా భంగం కలిగిస్తోందని వారు అన్నారు. మండలంలోని అందరు సర్పంచుల పరిస్థితి ఇదేనని వారు అన్నారు.

ఇలాంటి అధికారుల ద్వారా ప్రభుత్వానికి...

ఒక గ్రామం నుండి మరో గ్రామానికి వెళ్లే మిషన్ భగీరథ పైప్లైన్ పగిలిపోయింది దాన్ని మరమ్మతులు చేసి గ్రామానికి మంచినీటి విడుదల చేయాలని మిషన్ భగీరథ అధికారులను త్వరగా డబ్బులు ఇస్తేనే ఆ పైప్ లైన్ మర్మాత చేస్తామని లేదంటే చెయ్యమని కరాకండిగా చెప్తారని ఇదే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేకు తెలియజేస్తామని చెబితే ఎమ్మెల్యే కన్నతల్లి ఇంకెవరికైనా చెప్పండి మేము మాత్రం చేయమని మిషన్ భగీరథ అధికారి సర్పంచ్ తో చెప్పినట్లు ఆరోపించారు. దీంతోపాటు సిసి రోడ్లు డ్రైనేజీ పనులు విధి దీపాలు ఇలా ఏ పని చేసిన వాటి బిల్లు పాస్ చేయాలంటే అధికారుల చేయి తడపాల్సిందేనని సంబంధిత అధికారులు నిర్మొహమాటంగా లంచం డిమాండ్ చేస్తున్నారని వారు ఆరోపించారు. ఇలాంటి అధికారుల ద్వారా ప్రభుత్వానికి ఇటు స్థానిక ఎమ్మెల్యేకు చెడ్డపేరు రావడంతో పాటు గ్రామాల్లో అభివృద్ధి కొంటుపడిపోతుందని అధికారుల చర్యల వల్ల ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సర్పంచులు ఏమి చేయలేని పరిస్థితి నెలకొందని అన్నారు వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని దీనిపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సర్పంచులు హెచ్చరించారు.

అవినీతి అధికారులను చెట్టుకు కట్టేయండి ఎమ్మెల్యే

గ్రామపంచాయతీలకు రావాల్సిన బిల్లులు పాస్ చేయడంలో అధికారులు లంచం డిమాండ్ చేస్తున్న విషయాన్ని అధికార పార్టీ నాయకులు సర్పంచ్లు స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఈ విషయంపై తీవ్రంగా స్పందించారని అలా మరోసారి ఏ అధికారి అయినా లంచం డిమాండ్ చేసిన అధికారులను తమ గ్రామంలోని చెట్టుకు కట్టేయలని ప్రజా ప్రభుత్వ పాలనలో అవినీతికి తావు లేదని ఏ ఒక్క సర్పంచ్ కూడా బిల్లులు పాస్ చేయడానికి ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని లంచం డిమాండ్ చేసిన అధికారుల వివరాలు ఆధారాలతో ఇవ్వాలని సర్పంచ్లకు ఎమ్మెల్యే సూచించినట్లు బాలనగర్ మండల సర్పంచులు తెలిపారు. సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు కుమార్ నాయక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్ సర్పంచులు వెంకటేశ్వర రెడ్డి పవన్ కుమార్ సురేష్ నాయక్ యాదయ్య తోపాటు మండలంలోని పలువురు సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

సర్పంచుల ఆరోపణలతో తీవ్ర కలకలం

బాలనగర్ మండలంలోని అధికార పార్టీ సర్పంచులు సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరి అధికారులు లంచం డిమాండ్ చేసిన తీరును బహిరంగంగా ఆరోపించడంతో బాలనగర్ మండలం తో పాటు జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు అవినీతి శాఖ అధికారులు ఇలాంటి అధికారులపై డేగ కన్నుతో పరిశీలిస్తూ అవినీతి అధికారుల భరతం పడుతుండగా ఇక్కడ మాత్రం ప్రభుత్వ పనులకు కూడా అది అధికార పార్టీ సర్పంచుల వద్ద లంచం డిమాండ్ చేస్తుండడం తీవ్ర కలకలం రేపింది ఇంకా నేరుగా అధికారులు లంచం డిమాండ్ చేస్తున్నారంటే వారి వెనుక ఎవరైనా పెద్ద ప్రజాప్రతినిధులు లేదా ఉన్నత అధికారుల అండదండలు ఉన్నాయా అనే చర్చ జోరుగా జరుగుతుంది.

Next Story