ఓ వరుణ దేవా కరుణించూ...

by Batti.Sumithra |

సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో లోకం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నాచగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సోమవారం వరుణ యాగం ఘనంగా ప్రారంభమైంది.

ఓ వరుణ దేవా కరుణించూ...
X

దిశ, ​వర్గల్ : సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో లోకం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నాచగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సోమవారం వరుణ యాగం ఘనంగా ప్రారంభమైంది. ఆలయ ఈఓ రంగాచారి పర్యవేక్షణలో యాగ క్రతువు వైభవంగా నిర్వహించారు. ​యాగంలో భాగంగా తొలిరోజు వేద పండితులు, అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. గణపతి పూజతో ప్రారంభించి పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ఠ, ఋష్యశృంగ జపం, ప్రత్యేక హోమాలను భక్తిశ్రద్ధలతో పూర్తి చేశారు.

Next Story