భార‌త జ‌ట్టుతో మ్యాచ్‌.. పాకిస్తాన్ ప్ర‌ధాని కీల‌క ప్ర‌క‌ట‌న‌

by velandi.Saikiran |   (  Updated:2026-02-05 11:20:49  IST  )

ఇండియాతో మ్యాచ్ ర‌ద్దు చేసుకున్న‌ట్లు షరీఫ్ చెప్పిన ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు.

భార‌త జ‌ట్టుతో మ్యాచ్‌.. పాకిస్తాన్ ప్ర‌ధాని కీల‌క ప్ర‌క‌ట‌న‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియా, పాక్ మధ్య మ్యాచ్ జరగడంపై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. ఇండియా తో మ్యాచ్ ఆడబోమని ఇప్పటికే పాకిస్తాన్ ప్రకటన చేసింది. అయితే 48 గంటల తర్వాత పాకిస్తాన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందని ఐసీసీ భావించి, ఛాన్స్ కూడా ఇచ్చింది. కానీ పాకిస్తాన్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు అంగీకారం తెలపడం లేదు పాకిస్తాన్. ఈ మేరకు తాజాగా పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ మరోసారి దీనిపై క్లారిటీ ఇచ్చారు. టీ20 వరల్డ్ కప్ లో ఇండియాతో జరిగే మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు మరోసారి తేల్చి చెప్పారు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్.

బంగ్లాదేశ్ కోసం పాకిస్తాన్ త్యాగం

ఇండియాతో మ్యాచ్ ర‌ద్దు చేసుకున్న‌ట్లు షరీఫ్ చెప్పిన ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. బంగ్లాదేశ్ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ, వాళ్లకు అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్తాన్ పీఎం షరీఫ్ తెలిపారు. క్రీడల్లో రాజకీయాలకు అసలు తావు లేదని ఆయన వెల్లడించారు. ఇదే సరైన నిర్ణయం అని.. ఇండియాతో జరిగే మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. దీంతో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ చేసిన ప్రకటన వైరల్ గా మారింది. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ చేసిన ఈ ప్రకటన నేపథ్యంలో ఐసీసీ స్పందించాల్సి ఉంటుంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం ఇండియాతో పాకిస్తాన్ మ్యాచ్ జరగకపోతే కోట్లల్లో నష్టం వాటిల్లే ప్రమాదం ఉందట. దాదాపు 4 వేల కోట్ల వరకు నష్టం జరుగుతుందని నేషనల్ మీడియా చెబుతోంది. అయితే ఈ నష్టాన్ని మొత్తం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి రాబట్టే హక్కు ఐసీసీకి కూడా ఉంటుందట. ఈ మేరకు రూల్స్ స్టిక్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మరి పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయం పైన ఐసీసీ ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.

పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడేందుకు మేము రెడీ.. భారత కెప్టెన్ ప్రకటన

Next Story