- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వోల్వో బస్సు, ట్రక్కు ఢీ.. ఒకరు మృతి ఇద్దరికి తీవ్ర గాయాలు
వోల్వో బస్సు, ట్రక్కు ఢీకొని డ్రైవర్ మృతి చెందిన సంఘటన దేవరకద్ర మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

దిశ,దేవరకద్ర: వోల్వో బస్సు, ట్రక్కు ఢీకొని డ్రైవర్ మృతి చెందిన సంఘటన దేవరకద్ర మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్ పెట్రోల్ బంక్ సమీపంలోని క్రాసింగ్ వద్ద రాయచూర్ రహదారి 167 పై మంగళూరు నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వస్తున్న భారతి ట్రావెల్స్ చెందిన వోల్వో బస్సు హైదరాబాద్ నుంచి రాయచూర్ వైపు వస్తున్న మినీ ట్రక్కు ఎదురెదురుగా ఢీకొనడంతో ట్రక్కు డ్రైవర్ ట్రక్కులో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు. వోల్వో బస్సు డ్రైవర్ కు కాళ్లు విరిగిపోయాయి. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటన స్థలానికి వెంటనే పోలీసులు చేరుకుని ట్రక్కులో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను జేసీబీ సాయంతో బయటకు తీశారు. గాయాలైన ఇద్దరినీ అంబులెన్స్ లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు దేవరకద్ర ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు.
విశాఖ సముద్రంలో ఏడుగురు మత్స్యకారుల గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Train Accident: రైలు పట్టాలపై రక్తపుటేరులు.. ట్రైన్ ఢీకొని నలుగురు దుర్మరణం






