- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Train Accident: రైలు పట్టాలపై రక్తపుటేరులు.. ట్రైన్ ఢీకొని నలుగురు దుర్మరణం
చర్లపల్లి-షాలిమార్ రైలు ఢీకొని నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రైలు ఢీకొని నలుగురు దుర్మరణం పాలైన హృదయవిదారక ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు (Eluru) జిల్లాలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉంగుటూరు (Unguturu) మండల పరిధిలోని చేబ్రోలు (Chebrolu) రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్‌పై ఉన్న ప్రయాణికులను చర్లపల్లి - షాలిమార్ ఎక్స్‌ప్రెస్ (Charlapalli - Shalimar Express) దూసుకొచ్చి వారిని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో శరీరాలు పూర్తిగా ఛిద్రమే నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అయితే, మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ యువకుడు ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఓ మహిళా మృతదేహం వద్ద లభించిన ఏటీఎం కార్డుపై షేక్ హసీనా అని ఉంది. మరో మహిళ వద్ద తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో బైక్ పార్క్ చేసిన రసీదును పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో 2 మొబైల్ ఫోన్లు దొరికినప్పటకీ అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. అందులోని సిమ్‌కార్డులను తీసి మరో ఫోన్‌లో వేసి మృతుల వివరాలను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతా ఒకే కుటుంబానికి చెందిన వారై ఉంటారని, ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చిన అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
విశాఖ సముద్రంలో ఏడుగురు మత్స్యకారుల గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!






