విశాఖ సముద్రంలో ఏడుగురు మత్స్యకారుల గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!

by Ramesh Naini |   (  Updated:2026-07-05 04:31:34  IST  )

ఈ నెల 1వ తేదీన విశాఖపట్నం చేపల రేవు నుంచి వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.

విశాఖ సముద్రంలో ఏడుగురు మత్స్యకారుల గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ నెల 1వ తేదీన విశాఖపట్నం చేపల రేవు నుంచి వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారడంతో వీరు ప్రమాదంలో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. గల్లంతైన వారిలో ఆరుగురు విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాంకి చెందిన వారు కాగా, మరొకరు విశాఖ జిల్లా భీమిలికి చెందిన వారని గుర్తించారు. వాతావరణ పరిస్థితులపై కుటుంబ సభ్యులు ముందే అప్రమత్తం చేయగా, నాలుగో తేదీ మధ్యాహ్నం కల్లా తీరానికి చేరుకుంటామని మత్స్యకారులు చెప్పినట్లు సమాచారం. అయితే, శనివారం సాయంత్రం అయినా వారు తిరిగి రాకపోవడం, అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులను ఆశ్రయించారు.

రెస్క్యూ ఆపరేషన్..

ఈ విషయాన్ని మరపడవల ఆపరేటర్ల సంఘం ప్రతినిధులు మత్స్య శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గల్లంతైన మత్స్యకారుల (అప్పలరాజు, బండియ్య, గరగయ్య, సీతుడు, చిన్న అమ్మోరు, కారి చిన్న, చిన్నయ్య) ఆచూకీ కోసం నేవీ, మెరైన్ పోలీసు, కోస్ట్‌గార్డ్ సిబ్బందితో అధికారులు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిసింది.

Train Accident: రైలు పట్టాలపై రక్తపుటేరులు.. ట్రైన్ ఢీకొని నలుగురు దుర్మరణం

Next Story