క్లాసీ అవుట్‌ఫిట్‌లో కట్టిపడేస్తున్న కాయాదు లోహర్

by Pulgam srinivas |

క్లాస్ లుక్‌తో కట్టిపడేసిన కాయాదు లోహర్.. అందానికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్.

క్లాసీ అవుట్‌ఫిట్‌లో కట్టిపడేస్తున్న కాయాదు లోహర్
X

దిశ, వెబ్ డెస్క్: అందాల ముద్దుగుమ్మ కాయాదు లోహర్ 2021లో విడుదలైన కన్నడ చిత్రం 'మొగిల్‌పేట'తో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అనంతరం శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన 'అల్లూరి' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా, తన అందం, అభినయంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.




అయితే ఆ తర్వాత తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో కొంతకాలం సరైన గుర్తింపు కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. అయితే 2025లో విడుదలైన 'డ్రాగన్' చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకోవడంతో కాయాదు లోహర్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.




దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీకి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం నాని హీరోగా తెరకెక్కుతున్న 'ది ప్యారడైజ్' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమాల్లో గ్లామర్ షోకు ఏమాత్రం వెనుకాడని కాయాదు, సోషల్ మీడియాలో కూడా తన స్టైలిష్ ఫోటోలతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది.




అయితే తాజాగా మాత్రం పూర్తి క్లాస్ అండ్ డీసెంట్ లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోల్లో కాయాదు పర్పుల్ కలర్ డ్రెస్ ధరించి, దానిపై చున్నీ కప్పుకుని ఎంతో హుందాగా పోజులిచ్చింది. పెద్ద ఇయర్ రింగ్స్, చేతినిండా గాజులు, వేళ్లకు ఉంగరాలు ధరించి ట్రెడిషనల్ టచ్‌తో మెరిసిపోయింది.




అలాగే జుట్టును అందంగా వెనక్కు సర్దుకుని, కొన్ని వెంట్రుకలు ముఖంపై పడేలా స్టైల్ చేయడంతో ఆమె అందం మరింత హైలైట్ అయింది. మొత్తంగా ఈ ఫోటోల్లో కాయాదు లోహర్ క్లాస్, ఎలిగెన్స్, గ్లామర్‌ను కలగలిపిన లుక్‌తో అభిమానులను ఫిదా చేస్తుండగా, ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Photos Courtesy: Instagram

Next Story