గేదెను తప్పించబోయి బోల్తా పడిన కారు.. తృటిలో తప్పిన ప్రమాదం

by Jakkula.Mamatha |

రోడ్డుపైకి వచ్చిన గేదెను తప్పించబోయే క్రమంలో కారు అదుపు తప్పి పల్టీ కొట్టిన ఘటన నడిగూడెం మండలంలోని కాగిత రామచంద్రపురం గ్రామ శివారులో శనివారం రాత్రి చోటుచేసుకుంది

గేదెను తప్పించబోయి బోల్తా పడిన కారు.. తృటిలో తప్పిన ప్రమాదం
X

దిశ, నడిగూడెం: రోడ్డుపైకి వచ్చిన గేదెను తప్పించబోయే క్రమంలో కారు అదుపు తప్పి పల్టీ కొట్టిన ఘటన నడిగూడెం మండలంలోని కాగిత రామచంద్రపురం గ్రామ శివారులో శనివారం రాత్రి చోటుచేసుకుంది. నడిగూడెం ఎస్సై జి.అజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బృందావనపురం గ్రామానికి చెందిన కాసాని మహేష్ కారును ఆయన బంధువు ఖమ్మం వైపు తీసుకెళ్తుండగా, జిల్లా సరిహద్దు సమీపంలోని పాలేరు చిన్న వాగు వంతెన వద్ద అకస్మాత్తుగా గేదె రోడ్డు పైకి రావడంతో దానిని తప్పించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి వంతెన రైలింగ్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. అయితే ప్రమాద సమయంలో కారులో ఎలాంటి గాయాలు కాకపోవడంతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై తెలిపారు.

Next Story