'నిరుద్యోగులపై ఎండ్రిన్ వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి అహంకారానికి నిదర్శనం': ఏలేటి మహేశ్వర్ రెడ్డి

by Prasad Jukanti |   (  Updated:2026-07-05 07:29:19  IST  )

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నిరుద్యోగులను రోడ్డుమీద పడేసిందన్నారు.

నిరుద్యోగులపై ఎండ్రిన్ వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి అహంకారానికి నిదర్శనం: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. “ఎండ్రిన్ తాగి బావిలో దూకినా ....” అని నిరుద్యోగులను అవమానించేలా మాట్లాడటం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారానికి నిదర్శనం అన్నారు. తెలంగాణ పోలీస్ శాఖలో సుమారు 20,000 ఖాళీలు ఉంటే, కేవలం 5,000 పోస్టులకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం నిరుద్యోగ యువతను మోసం చేయడమేని మండిపడ్డారు. ఈ మేరకు ఇవాళ ఎక్స్ వేదికగా ఓ పోస్టుచేసిన ఆయన.. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు నిరుద్యోగులను రోడ్డుమీద పడేసిందని ద్వజమెత్తారు. నిరుద్యోగ యువతకు బీజేపీ అండగా నిలబడి, వారి హక్కులు సాధించే వరకు పోరాడుతుందని హామీ ఇచ్చారు.

పెరిగిన పోలీసు ఉద్యోగాల సంఖ్య:

అయితే పోలీస్ ఉద్యోగాల పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న వేళ రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మొత్తం 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. అయితే, ఇటీవలే 5 వేల ఉద్యోగాలకు అనుమతి లభించగా.. తాజాగా మరో 2,437 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మొత్తం 7,437 పోస్టులలో వివిధ విభాగాలకు చెందిన ఖాళీలు ఉన్నాయి.

Next Story