- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NTR-త్రివిక్రమ్ సినిమాపై చెలరేగిన వివాదం.. NTK పార్టీ అధినేత సంచలన వ్యాఖ్యలు
జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా చుట్టూ నీలిమేఘాలు కమ్ముకున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR), దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ మూవీ చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయి. తాజాగా ఈ సినిమా నిర్మాణాన్ని వెంటనే ఆపేయాలంటూ తమిళనాడుకు చెందిన నామ్ తమిళర్ కట్చి (NTK) పార్టీ అధినేత సీమాన్ (Seeman) సంచలన డిమాండ్ చేశారు. మూవీలో చూపించిన కొన్ని సాంస్కృతిక, ఆధ్యాత్మిక అంశాలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఉత్తరాంధ్ర దైవంగా మురుగన్..? తీవ్ర అభ్యంతరం
తమిళుల ఆరాధ్య దైవమన మురుగన్ (Murugan)ను మూవీలో ఉత్తరాంధ్ర ప్రాంత దైవంగా చూపించడంపై సీమాన్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుబ్రహ్మణ్యం స్వామి కేవలం తమిళనాడుకే చెందిన దైవమని చెప్పడానికి మా వద్ద చారిత్రక ఆధారాలు ఉన్నాయని అన్నారు. అటువంటి గొప్ప తమిళుల సంస్కృతి, భావోద్వేగాలతో ముడిపడి ఉన్న మురుగన్ స్వామిని వేరే ప్రాంత దైవంగా చూపించడం ఏంటని సీమాన్ ప్రశ్నించారు. వివాదాస్పదంగా ఉన్న ఈ సినిమాను వెంటనే నిలిపివేయాలని, లేనిపక్షంలో సినిమాకు వ్యతిరేకంగా తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలను తీవ్రస్థాయిలో ఉధృతం చేస్తామని ఆయన అల్టిమేటం జారీ చేశారు. అయితే, ఈ పంచాయతీపై దర్శకుడు త్రివిక్రమ్, నటుడు జూనియర్ ఎన్టీఆర్, నిర్మాణ సంస్థలు ఇంకా స్పందించలేదు.






