- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాయపడిన యువకుడికి రూ.22,700 ఆర్థిక సాయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చింతిర్యాల గ్రామపంచాయతీ పరిధిలోని కట్టంవారిగూడెంకు చెందిన ఎనిక కార్తీక్ (20) బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.

దిశ, అశ్వాపురం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చింతిర్యాల గ్రామపంచాయతీ పరిధిలోని కట్టంవారిగూడెంకు చెందిన ఎనిక కార్తీక్ (20) బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో గ్రామస్థులు, యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి రూ.22,700 ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ నెల 4న దుమ్ముగూడెం మండలం తురుబాక సమీపంలో జరిగిన బైక్ ప్రమాదంలో కార్తీక్ తలకు, ఛాతీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. చికిత్సకు సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తల్లిదండ్రులు ఎనిక పున్నమ్మ, ఎనిక రమేష్‌కు ఈ భారీ వైద్య ఖర్చు భరించడం కష్టంగా మారడంతో గ్రామ యువత "మేము సైతం కార్తీక్ కోసం" అనే నినాదంతో విరాళాల సేకరణ చేపట్టింది. గ్రామంలోని మహిళలు, యువకులు, పెద్దలు స్పందించి తక్షణ సాయంగా రూ.22,700 అందించారు. అదనంగా బంధువులు, మిత్రులు, దాతల ద్వారా మరింత సహాయం సమీకరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. కార్తీక్ త్వరగా కోలుకుని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని గ్రామస్థులు ఆకాంక్షిస్తూ, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా సహాయం అందించిన ప్రతి ఒక్కరికీ కార్తీక్ కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.






