రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు మల్లెమడుగు విద్యార్థినీలు

by Ratna Kumari |

ఖమ్మం రూరల్ మండలంలోని మల్లెమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినీలు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై ప్రతిభ చాటారు.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు మల్లెమడుగు విద్యార్థినీలు
X

దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ మండలంలోని మల్లెమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినీలు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై ప్రతిభ చాటారు. ఆదివారం ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఎంపిక పోటీల్లో ఎస్‌కే సుహానా అండర్-12 లాంగ్ జంప్ విభాగంలో, జి. నందిని అండర్-14 ట్రయాథ్లాన్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఈ నెల 12న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. సాంబమూర్తి, పీడీ బియ్యని కృష్ణయ్య తెలిపారు.

ఎస్‌కే సుహానా గత ఏడాది అండర్-10 లాంగ్ జంప్‌లో రాష్ట్రస్థాయికి ఎంపిక కాగా, జి. నందిని ఇప్పటికే అండర్-14 రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైనట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినులను ప్రధానోపాధ్యాయులు కె. సాంబమూర్తి, గ్రామ పెద్దలు నూకారపు వెంకటేశ్వరరావు, భోజర్ల సూర్యం, మనోజ్, పీడీ బియ్యని కృష్ణయ్య తదితరులు అభినందించి, జాతీయస్థాయిలోనూ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.

Next Story