పూర్తిగా సంక్షోభం.. 15న జగన్ భరోసా

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-05 12:28:04  IST  )

ఆక్వా రంగం పూర్తిగా సంక్షోభంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. రొయ్యల ఫీడ్ ధరల పెంపుతో ఆక్వా రైతులు అల్లాడిపోతున్నారు. ఫీడ్ ధరలు ఏకంగా రూ. 14 పెంచటంతో లబోదిబోమంటున్నారు. ..

పూర్తిగా సంక్షోభం.. 15న జగన్ భరోసా
X

దిశ, వెబ్ డెస్క్: ఆక్వా రంగం పూర్తిగా సంక్షోభంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. రొయ్యల ఫీడ్ ధరల పెంపుతో ఆక్వా రైతులు అల్లాడిపోతున్నారు. ఫీడ్ ధరలు ఏకంగా రూ. 14 పెంచటంతో లబోదిబోమంటున్నారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం రూ. 4 తగ్గించాలని ఆదేశించింది. అయితే వ్యాపారులు మాత్రం రూ. 2 తగ్గించారు. దీంతో ఆక్వా రైతులు మరింత ఆందోళన వ్యక్తం చేశారు. రూ.14 పెంచడమేంటని, రూ. 2 తగ్గించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆక్వారైతులను మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కలవనున్నారు. వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వంపై పోరాటం చేయనున్నారు. ఈ మేరకు ఆయన ఈ నెల 15న పశ్చిమగోదారి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. ఎన్నికల హామీ మేరకు ఫీడ్ ధర తగ్గించమని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేయనున్నారు. ఈ విషయాన్ని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అధికారికంగా వెల్లడించారు.

Next Story