- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం : ఎమ్మెల్యే
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని మాజీ మంత్రి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, వెల్దుర్తి: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని మాజీ మంత్రి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మండల పరిధిలోని ఉప్పు లింగాపూర్ కొత్తపల్లి గ్రామాల్లో వివో భవనాలకు భూమి పూజ నిర్వహించి రామయపల్లిలో నూతనంగా నిర్వహించిన పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. సునీత రెడ్డి మాట్లాడుతూ.. మెదక్ వెల్దుర్తి ప్రధాన రహదారి అస్తవ్యస్తంగా ఉందని ఈ రోడ్డు మరమ్మత్తులు చేసేందుకు సంబంధించిన మంత్రులకు నిధులు మంజూరు చేయాలని విన్నవించినట్టు తెలిపారు. మెదక్ వెల్దుర్తి రోడ్డుకు గత ప్రభుత్వ హయాంలోనే రిబి టి కోసం 18 కోట్ల నిధులు మంజూరు కాగా కాంట్రాక్టర్ పనులను చేయలేదని దీంతో ఇటీవల హమ్ ప్రాజెక్టులో రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు కాగా వెల్దుర్తి మెదక్ రహదారికి నిధులు మంజూరు చేద్దాం అనుకుంటే ఆన్లైన్ లో సమస్య ఉందని ఆమె అన్నారు.
రోడ్ల అభివృద్ధికి కేంద్రం తప్ప రాష్ట్రం ఎలాంటి నిధులు మంజూరు చేయకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని రోడ్లు అద్వానంగా తయారయ్యాయని అన్నారు. రైతు ప్రభుత్వం అంటూ అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రైతులు వ్యవసాయానికి అవసరపడే యూరియాను ఆన్లైన్లో కొనుగోలు చేసే దుస్థితి నెలకొందని మండి పడ్డారు. మండల పరిధిలోని ఎనిమిది గ్రామాలకు మహిళా సమైక్య భవనాలకు రూ. 10 లక్షల చొప్పున నిధులు మంజూరైనట్లు సునీత రెడ్డి అన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రమేష్ గౌడ్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మోహన్ రెడ్డి, కృష్ణ గౌడ్, సర్పంచులు పావని, మహేందర్, కృష్ణ, శేఖర్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, అశోక్ గౌడ్, మల్లేశం గౌడ్, మైసయ్య, శేఖర్, పార్టీ కార్యకర్తలు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.






