- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో ప్రతి రంగాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజా పాలన సాగిస్తున్నాం
రాష్ట్రంలోని ప్రతి రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజా పాలన కొనసాగించడం జరుగుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు.

దిశ, మంచిర్యాల: రాష్ట్రంలోని ప్రతి రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజా పాలన కొనసాగించడం జరుగుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. ఆదివారం జిల్లాలోని భీమారం మండల కేంద్రంలో అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజల సంక్షేమంలో భాగంగా ప్రతి రంగంపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మండల కేంద్రంలో మురుగు నీటి కాలువ నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. 143 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందించడం జరిగిందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు సొంత స్థలం కలిగిన వారికి ఇందిరమ్మ ఇండ్ల పథకం వర్తింప చేయడం జరుగుతుందని తెలిపారు. అర్హులందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందని, రేషన్ కార్డులు జారీ చేసి చౌక ధరల దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అందించేలా క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నామని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గ పరిధిలో పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో రూ. 36 కోట్ల తో 56 కిలోమీటర్ల మేర రహదారులు, రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో రూ. 63 కోట్ల వ్యయంతో రహదారులు నిర్మించడం జరుగుతుందన్నారు.
నిరంతరం త్రాగునీటి సరఫరా
భీమారం మండల పరిధిలో 6 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు చేపట్టామన్నారు. అమృత్ 2.0 త్రాగునీటి పథకం క్రింద ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా నిరంతరం త్రాగునీటి సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సుమారు రూ. 100 వ్యయంతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంపై కొందరు ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలలో ఆందోళనలు కలిగిస్తున్నారన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని కఠిన చర్యలు చేపడతామని తెలిపారు. చెన్నూర్ పట్టణంలో రహదారి విస్తరణలో వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని రూ. 1 కోటి 60 లక్షల నిధులతో డి.ఎం.ఎఫ్.టి నిధులతో బైపాస్ రోడ్డు నిర్మించడం జరుగుతుందని రూ.1. 20 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న 20 షాపులలో పేద వ్యాపారస్తులకు ప్రాధాన్యత ఇచ్చి కేటాయించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రూ. 12 కోట్ల సి.ఎస్.ఆర్ నిధులతో చెన్నూర్ నియోజకవర్గంలో రహదారులు, మురుగు కాలువల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడంతో పాటు అన్ని గ్రామాలలో రహదారులు, మురుగు కాలువల వ్యవస్థ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సి.సి. మురుగు కాలువలలో మ్యాజిక్ సోక్ ఫీట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామనన్నారు.
ఉద్దేశపూర్వకంగా పిల్లలతో అబద్ధాలు చెప్పించారు
తద్వారా భూగర్భ జల శాతాన్ని పెంపొందించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. డి ఎం ఎఫ్ టి, సి ఎస్ ఆర్ నిధులతో భీమారంలో అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మైనారిటీ సంక్షేమ వసతి గృహంలో మధ్యాహ్న భోజనం విషయంలో ఏర్పడిన గందరగోళంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా పిల్లలతో అబద్ధాలు చెప్పించారని, సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యారంగంలో మంచిర్యాల జిల్లా 3వ స్థానంలో ఉందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు ఇతర ప్రభుత్వ సంబంధిత విద్యా సంస్థలలో ఈ సంవత్సరం నో అడ్మిషన్ బోర్డులు పెట్టడం జరిగిందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో 3 వేల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలలో చేరారని తెలిపారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధి ప ప్రత్యేక దృష్టి సారిస్తుందని, విద్యాసంస్థలలో సి.సి. కెమెరాల తో పర్యవేక్షించడం జరుగుతుందని, విద్యార్థులకు 200 శాతం కాస్మోటిక్, 40 శాతం డైట్ చార్జీలు పెంచి అందించడం జరుగుతుందని, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం భోజనశాలలు, అదనపు తరగతి గదులు నిర్మించడం జరుగుతుందని, ఆర్.ఓ. ప్లాంట్లు ఏర్పాటుచేసి శుద్ధమైన త్రాగునీటిని అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






