పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తా

by Batti.Sumithra |

నాచారం 21వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన డివిజన్ అధ్యక్షుడికి ఘన సన్మానం, మాజీ అధ్యక్షుడికి వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించారు.

పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తా
X

దిశ, నాచారం : నాచారం 21వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన డివిజన్ అధ్యక్షుడికి ఘన సన్మానం, మాజీ అధ్యక్షుడికి వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాచారం 21వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన నూతనకంటి రాజును కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన డివిజన్ అధ్యక్షుడు నూతనకంటి రాజు మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. అదేవిధంగా, ఇప్పటివరకు నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా సేవలందించిన మాజీ అధ్యక్షుడు బండారి శ్రీకాంత్ గౌడ్‌కు నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు. పార్టీ అభివృద్ధికి ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వారిలో హెచ్.ఆర్. మోహన్, బండారి శ్రీకాంత్ గౌడ్, మామిడాల రాజ్‌రెడ్డి, బండారి రఘు, సేవాదళ్ వెంకటేష్, ఎం.డి. ఫసియుద్దీన్, నరేందర్ యాదవ్, వరుణ్, శ్రీకాంత్, జావీద్, బొల్లం నరేష్, చిలుక నరేష్, టోనీ, టీ. బాలరాజ్, రాజశేఖర్, చందు నాయక్, పూర్ణిమ, సుజాత, షాహీన్, నజ్మా, సనా, లక్ష్మి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story