- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో దారుణం.. భార్యను వ్యభిచారవృత్తిలోకి దింపిన భర్త.. రోజూ రూ.5వేలు సంపాదించాలని టార్చర్
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తనే భార్యను వ్యభిచారకూపంలోకి నెట్టి వేధింపులకు గురి చేశాడు. ఈ ఘటన చిత్తూరు పట్టణంలో జరిగింది. రాజేష్, మమత దంపతులు పట్టణంలో ఉంటూ జీవివం సాగిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తే భార్యను వ్యభిచారకూపంలోకి నెట్టి వేధింపులకు గురి చేశాడు. ఈ ఘటన చిత్తూరు పట్టణంలో జరిగింది. రాజేష్, మమత దంపతులు పట్టణంలో ఉంటూ జీవివం సాగిస్తున్నారు. పదిహేనేళ్ల క్రితమే వీరికి వివాహం కాగా మొదట్లో ఆటో నడిపి సంపాదన లేక భార్యను వ్యభిచారవృత్తిలోకి నెట్టివేశాడు. మొదట పుత్తూరులోని ఓ మహిళ ఇంట్లో ఉంచి ప్రతిరోజు రూ.3వేలు తీసుకుని వ్యభిచారానికి వదిలేసిన భర్త ఆ తరవాత సొంతంగా ఇల్లు అద్దెకు తీసుకుని దందా నడిపించడం మొదలుపెట్టాడు. ఈక్రమంలో ప్రతిరోజు రూ.5వేలు సంపాదించాలని భార్యకు కండిషన్ పెట్టాడు. అంతేకాకుండా ఆమెకు తెలియకుండా వీడియోలు తీయడం, ఎవరితో అయినా మాట్లాడితే అనుమానిస్తూ వేధింపులకు గురిచేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
ఈ సందర్భంగా బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ... ఎక్కువ డబ్బు సంపాదిస్తే త్వరగా జీవితంలో స్థిరపడవచ్చని చెబుతూ తనను ఈ వృత్తిలోకి దింపినట్టు ఆవేదన వ్యక్తం చేసింది. వ్యభిచారం చేయిస్తూనే ఎవరితోనైనా మాట్లాడితే అనుమానిస్తూ టార్చర్ చేసేవాడని, దారుణంగా కొట్టేవాడని బాధితురాలు తెలిపింది. అతడిని విడిచిపెట్టి వెళ్లిపోతానేమో అనే భయంతో అనుమానం పెంచుకుని వేధించడం మొదలుపెట్టాడని చెప్పింది. వచ్చేవాళ్లను కూడా కొట్టేందుకు ప్రయత్నించడం, తనపై దాడి చేయడంతో కొందరు పారిపోయేవారని తెలిపింది. గత పదేళ్లుగా వ్యభిచారం ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని తన భర్తకే అప్పగించినట్టు చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.






