నన్ను నేను చూపించుకోలేకపోయా.. హీరో అఖిల్ ఎమోషనల్

by Ajay Maddhiboyina |

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లెనిన్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నేడు తిరుపతిలో జరిగింది. ఈ ఈవెంట్‌లో అఖిల్ ఎమోషనల్ అయ్యాడు. రెండేళ్ల విరామం తరవాత అభిమానుల ముందుకు రావడంతో, గ్యాప్ వచ్చినందుకు క్షమాపణలు కోరారు. ఎందుకో నన్ను నేను చూపించుకోలేకపోయా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

నన్ను నేను చూపించుకోలేకపోయా.. హీరో అఖిల్ ఎమోషనల్
X

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లెనిన్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నేడు తిరుపతిలో జరిగింది. ఈ ఈవెంట్‌లో అఖిల్ ఎమోషనల్ అయ్యాడు. రెండేళ్ల విరామం తరవాత అభిమానుల ముందుకు రావడంతో, గ్యాప్ వచ్చినందుకు క్షమాపణలు కోరారు. ఎందుకో నన్ను నేను చూపించుకోలేకపోయా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ తో ఉన్నానని, మళ్లీ మీ ముందుకు వస్తున్నానని చెప్పాడు. ఆ మైండ్ సెట్ లెనిన్ అంటూ వ్యాఖ్యానించాడు. లెనిన్ తో ప్రేక్ష‌కుల ఇంటికి వెళ‌తాన‌ని అన్నారు.

ఎప్పుడైతే ఇంటికి వెళ్ల‌గ‌లుగుతానో అప్పుడే సంతోషంగా ఉంటాన‌ని చెప్పారు. ఇక ఇదే ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ.. జులై 10న వ‌స్తున్నామ‌ని, మ‌న‌వాడు హిట్ కొడుతున్నాడ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉంటే ఇప్ప‌టి వ‌ర‌కు అఖిల్ ఖాతాలో స‌రైన హిట్ సినిమా ప‌డ‌లేద‌న్న సంగ‌తి తెలిసిందే. క్లాస్.. మాస్.. రొమాంటిక్ అన్ని ర‌కాల జోన‌ర్లు ప్ర‌య‌త్నించినా ఆశించిన ఫ‌లితం మాత్రం ద‌క్క‌లేదు. దీంతో సినిమాకు దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. ఈసారైనా అఖిల్ హిట్ కొట్టాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

Next Story