- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
T20 World Cup : ఆస్ట్రేలియా అమ్మాయిలే విశ్వవిజేతలు.. ఏడోసారి పొట్టి కప్పు సొంతం
మహిళల టీ20 వరల్డ్ కప్-2026 విజేతగా ఆస్ట్రేలియా జట్టు నిలిచింది.

దిశ, స్పోర్ట్స్ : మహిళల టీ20 వరల్డ్ కప్-2026 విజేతగా ఆస్ట్రేలియా జట్టు నిలిచింది. లండన్‌లోని ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో ఆసిస్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. దీంతో ఆస్ట్రేలియా 7వ సారి టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో టీ20 ప్రపంచకప్ గెలిచిన ఘనత ఆ జట్టు సొంతం. ఇప్పుడు ఆ రికార్డును మరింత పదిలం చేసుకుంది. ఫైనల్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఆ జట్టును కెప్టెన్ నాట్ స్కివర్ బ్రంట్, ఫ్రెయా కెంప్ కీలక ఇన్నింగ్స్ ఆడి ఆదుకున్నారు. బ్రంట్ 53 బంతుల్లో 58 పరుగులు చేయగా.. కెంప్ 28 బంతుల్లో 44 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అయితే, పోరాడే లక్ష్యాన్ని ఇంగ్లాండ్ కాపాడుకోలేకపోయింది. 151 పరుగుల టార్గెట్‌ను ఆస్ట్రేలియా అలవోకగా ఛేదించింది. బెత్ మూనీ 49 బంతుల్లో 64 పరుగులతో రాణించింది. లిచ్‌ఫీల్డ్ కూడా 35 బంతుల్లో 48 రన్స్ చేసి సత్తాచాటింది. వీరిద్దరూ రాణించడంతో ఆస్ట్రేలియా 17.1 ఓవర్లలోనే విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది.






