మళ్ళీ నోకియా ఫోన్లు వస్తున్నాయ్.. AI తో సహా!

by Muthe.Rajitha |

ప్రముఖ నోకియా బ్రాండ్‌ సరికొత్తగా నాలుగు నోకియా ఫీచర్ ఫోన్‌లను (Nokia Feature Phones) ఒకేసారి భారత మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది.

మళ్ళీ నోకియా ఫోన్లు వస్తున్నాయ్.. AI తో సహా!
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ నోకియా బ్రాండ్‌పై మొబైళ్లను తయారుచేసే ఫిన్లాండ్‌కు చెందిన హెచ్‌ఎండీ (HMD) గ్లోబల్ సంస్థ సరికొత్తగా నాలుగు నోకియా ఫీచర్ ఫోన్‌లను (Nokia Feature Phones) ఒకేసారి భారత మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. నోకియా 200 4G, నోకియా 210 4G మోడళ్లతో పాటు గతంలో సూపర్ హిట్ అయిన నోకియా 215 4G, నోకియా 235 4G ఫోన్ల రెండో ఎడిషన్‌ (Second Edition) వెర్షన్లను కూడా ఈ జాబితాలో చేర్చింది. సాధారణ ఫీచర్ ఫోన్లకు భిన్నంగా ఈ సరికొత్త సిరీస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను జోడించడం విశేషం.

హెచ్‌ఎండీ తీసుకొచ్చిన ఈ సరికొత్త నోకియా 4G ఫీచర్ ఫోన్లలో ఎన్నో అధునాతన ఆప్షన్లను యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫోన్లలో ప్రత్యేకంగా ఒక 'ఏఐ బటన్' ఆప్షన్‌ను అందించారు. దీనితో పాటు ఇందులో ‘ఎక్స్‌ప్రెస్‌ చాట్‌’ (Express Chat) యాప్‌ను ప్రీ-ఇన్‌స్టాల్‌గా ఇచ్చారు. దీని ద్వారా వినియోగదారులు చాలా సులువుగా వీడియో కాల్స్‌ మాట్లాడుకునే వీలుంటుంది. ఈ ఫోన్‌లలో అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ‘Sikey AI’ అసిస్టెంట్‌ ఫీచర్. ఈ సరికొత్త ఏఐ అసిస్టెంట్ సాయంతో కేవలం మన వాయిస్ కమాండ్స్‌తోనే మొబైల్‌ ఫ్లాష్‌లైట్ ఆన్ చేయడం, కెమెరా ఓపెన్‌ చేయడం, రిమైండర్‌లు సెట్‌ చేసుకోవడం, అలాగే నేరుగా ఫోన్‌ కాల్స్‌ చేయడం వంటి పనులను క్షణాల్లో పూర్తి చేయవచ్చు. అంతేకాకుండా, ఈ మొబైళ్లలో ఇంటర్నల్ స్టోరేజీతో సంబంధం లేకుండా నేరుగా క్లౌడ్ ద్వారా ఫీచర్లను ఉపయోగించుకునే ‘క్లౌడ్ ఫోన్ సర్వీస్’ ఆప్షన్‌ను కూడా జోడించారు.

ఈ నాలుగు ఫీచర్ ఫోన్లలో లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ కోసం 1450mAh సామర్థ్యం గల శక్తివంతమైన బ్యాటరీని అమర్చారు. ఆధునిక కాలానికి అనుగుణంగా ఈ ఫోన్లన్నింటికీ యూఎస్‌బీ టైప్‌-సి (USB Type-C) ఛార్జింగ్ పోర్ట్‌ సదుపాయాన్ని కల్పించారు. మార్కెట్లోకి స్ట్రెయిట్ ఎంట్రీ ఇచ్చిన ఈ నోకియా 4G ఫోన్‌ల ధరలను కానీ, ఇవి ఎప్పటి నుంచి మార్కెట్లో విక్రయానికి అందుబాటులోకి వస్తాయనే వివరాలను కానీ హెచ్‌ఎండీ సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే ఈ ధరల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Next Story