యూపీలో మళ్లీ ఎన్డీఏదే అధికారం.. బీజేపీ చీఫ్ నితిన్ నబిన్ ధీమా

by I. Sairam |

యూపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఎన్డీఏ అధికారం చేపట్టబోతోందని బీజేపీ చీఫ్ నితిన్ నబిన్ ధీమా వ్యక్తం చేశారు.

యూపీలో మళ్లీ ఎన్డీఏదే అధికారం.. బీజేపీ చీఫ్ నితిన్ నబిన్ ధీమా
X

దిశ, నేషనల్ బ్యూరో : రాబోయే 2027 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆదివారం ప్రకటించారు. లక్నోలోని తాజ్ హోటల్‌లో ఎన్డీఏ మిత్రపక్షాల నాయకులతో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ స్పష్టమైన మెజారిటీతో ఉత్తర ప్రదేశ్‌లో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఈ ఎన్నికల్లో ఒంటరిగానైనా పోరాడేందుకు సమర్థత ఉందని పేర్కొన్నారు. అయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కలిసికట్టుగా పనిచేస్తూ ఉత్తర ప్రదేశ్‌ను ఒక ఉత్తమ ప్రదేశ్‌గా మార్చడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్ రూపురేఖలను మార్చివేసిందని కొనియాడారు. కాగా.. రెండు రోజుల పర్యటన నిమిత్తం లక్నోకు వచ్చిన నబిన్.. పార్టీ నేతలు, మిత్రపక్షాలతో వరుస సమీక్షా సమావేశాలు నిర్వహించారు. రాబోయే ఎన్నికల కోసం కసరత్తును ముమ్మరం చేశారు.

Next Story