- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Microsoft: మైక్రోసాఫ్ట్‌లో మరో విడత ఉద్యోగాల కోత
ఈ కోతలు ప్రధానంగా సేల్స్, కన్సల్టింగ్, అలాగే ఎక్స్‌బాక్స్ గేమింగ్ విభాగాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగుల కోతలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కంపెనీ తన మొత్తం ఉద్యోగుల్లో 2.5 శాతం వరకు తొలగించే ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ నిర్ణయాన్ని వచ్చే వారం ప్రారంభంలో ప్రకటించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఈ కోతలు ప్రధానంగా సేల్స్, కన్సల్టింగ్, అలాగే ఎక్స్‌బాక్స్ గేమింగ్ విభాగాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఈ వార్తలపై మైక్రోసాఫ్ట్ అధికారికంగా స్పందించలేదు. ఏఐ మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు పెడుతూనే, నిర్వహణ ఖర్చులను తగ్గించే వ్యూహంలో భాగంగానే ఈ పునర్వ్యవస్థీకరణ జరుగుతున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల ఎక్స్‌బాక్స్ గేమింగ్ విభాగంలో కూడా ఉద్యోగాల కోతలు, మార్కెటింగ్ బడ్జెట్ తగ్గింపు, వ్యాపార పునర్వ్యవస్థీకరణపై చర్చలు జరుగుతున్నట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. గత ఏడాది కూడా మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగుల్లో సుమారు 4 శాతం మందిని తొలగించింది. మరోవైపు, ఏఐపై దృష్టి పెంచుతున్న టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. మెటా ఈ ఏడాది తన ఉద్యోగుల్లో 10 శాతం మందిని తగ్గించే ప్రణాళిక ప్రకటించగా, అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 16 వేల ఉద్యోగాలను తగ్గించే చర్యలు చేపట్టింది.






