- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ20 పెట్రోల్ మాకొద్దు.. ఢిల్లీలో వాహనదారుల నిరసన
ఈ20 పెట్రోల్ వల్ల వాహనాలు పాడువుతున్నాయని, మైలేజ్ తగ్గిపోతోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు.

దిశ, నేషనల్ బ్యూరో : జాతీయ ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్‌ను ప్రభుత్వం హడావుడిగా అమలు చేస్తోందని, ఈ 20 పెట్రోల్ వల్ల వాహనాలకు తరచూ సమస్యలు వస్తున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు సోషల్ మీడియా వేదికగా వినిపించిన ఫిర్యాదులు తొలిసారిగా ప్రత్యక్ష రూపం దాల్చాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘హమారీ గాడీ, హమారా అధికార్’ (మా వాహనం, మా హక్కు) అనే నినాదంతో వ్యాపారవేత్త, టీవీ డిబేటర్ తెహసీన్ పూనావాలా. ఆయనకు చెందిన ‘టీమ్ భారత్’ అనే సంస్థ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. భారత్‌లో ఈ20 విధానానికి వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో జరిగిన మొదటి నిరసన ఇదే కావడం గమనార్హం. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ.. ఇది ఎలాంటి రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళన కాదని, కేవలం తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులపైనే పోరాడుతున్నామని స్పష్టం చేశారు. వీరిలో పలువురు తాము బీజేపీ మద్దతుదారులమే అయినప్పటికీ, విధానాన్ని అమలు చేసిన తీరును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
80 శాతం కార్లు ఈ 20కి అనుకూలం కావు..
గత 15 ఏళ్లలో భారత్‌లో అమ్ముడైన సుమారు 80 శాతం కార్లు ఈ20 ఇంధనానికి అనుకూలంగా లేవని, అవి కేవలం ఈ10 లేదా అంతకంటే తక్కువ ఇథనాల్ మిశ్రమానికి మాత్రమే సరిపోతాయని నిరసనకారులు వాదించారు. గురుగ్రామ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సార్థక్ మాట్లాడుతూ.. తన 2018 మోడల్ బాలెనో కారు రెండు నెలల్లో 22 శాతం మైలేజ్ తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్ సింగ్ అనే వాహనదారుడు మాట్లాడుతూ.. గత 7 నెలలుగా ఈ20 ఇంధనాన్ని వాడుతుండగా, ఇటీవలే కారు ఇంజిన్ వార్నింగ్ లైట్ ఆన్ అయ్యిందని చెప్పారు. కారు ఫ్యూయల్ సిస్టమ్ మొత్తం పాడవడంతో దానిని బాగు చేయడానికి రూ. 35 వేలు కంటే ఎక్కువ ఖర్చయిందని తెలిపారు. ఢిల్లీకి చెందిన మరో వాహనదారుడు మాట్లాడుతూ.. తన కారు అకస్మాత్తుగా ఆగిపోవడంతో సర్వీస్ సెంటర్‌కు తరలించాల్సి వచ్చిందని, ఇథనాల్ ఇంధనం వల్లే ఇలాంటి సమస్యలతో రోజుకు 7-8 కార్లు వస్తున్నట్లు అక్కడి సిబ్బంది తెలిపారని పేర్కొన్నారు. వాహనదారులకు స్వచ్ఛమైన పెట్రోల్ లేదా తక్కువ ఇథనాల్ మిశ్రమం ఉన్న ఈ5, ఈ10 ఇంధనాలను ఎంచుకునే సదుపాయాన్ని కల్పించాలని వారు డిమాండ్ చేశారు.ఇథనాల్‌ను ప్రధానంగా చెరకు నుండి తయారు చేస్తారని, ఈ విధానం వెనుక షుగర్ లాబీ ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిరసనకారులు ఆరోపించారు.






