SATLUJ : నాలుగేళ్ల తర్వాత OTT లోకి.. రెండు రోజులకే తొలగింపు

by Muthe.Rajitha |

సెన్సార్ అడ్డంకులతో నాలుగేళ్లపాటు నిలిచిపోయిన "SATLUJ" చిత్రం.. OTT లో విడుదలైన రెండు రోజులకే తొలగిచబడింది.

SATLUJ : నాలుగేళ్ల తర్వాత OTT లోకి.. రెండు రోజులకే తొలగింపు
X

దిశ, వెబ్ డెస్క్ : సెన్సార్ అడ్డంకులతో నాలుగేళ్లపాటు నిలిచిపోయిన "SATLUJ" చిత్రం.. OTT లో విడుదలైన రెండు రోజులకే తొలగిచబడింది. బాలీవుడ్ నటుడు దిల్జీత్ దోసాంజ్ తాజా చిత్రం 'సట్లుజ్' (Punjab 95) వివాదాలకు కేంద్ర బిందువయింది. 2022లో నిర్మించబడిన ఈ చిత్రంపై సెన్సార్ బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దాదాపు 127 కట్స్ చెప్పడంతో థియేటర్లలోకి రాకుండా పోయింది. ఎట్టకేలకు 2026, జూలై 3న ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో ఎటువంటి కట్స్ లేకుండా ‘uncut’ గా రిలీజ్ అయిన ఈ సినిమాను జులై 5న ఇండియాలో స్ట్రీమింగ్ నుంచి అకస్మాత్తుగా తొలగించారు.

తొలగింపుకు కారణాలు ఇవేనా?

ఈ సినిమా 1990ల పంజాబ్ మిలిటెన్సీ కాలంలో దాదాపు 25,000 మంది అదృశ్యాలు, ఎన్‌కౌంటర్ల వాస్తవాలను వెలికితీసిన ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా (Jaswant Singh Khalra) జీవితం ఆధారంగా తెరకెక్కినది. ఈ సున్నితమైన కథాంశం కారణంగా థియేట్రికల్ రిలీజ్ కోసం సెన్సార్ బోర్డు (CBFC) 127 కట్స్ అడిగింది. అయితే అందుకు చిత్ర బృందం ఒప్పుకోకపోవడంతో, సినిమాను నేరుగా ఓటీటీలోనే విడుదల చేశారు. తాజా పరిణామంపై ZEE5 స్పందిస్తూ.. "ప్రస్తుత పరిణామాల దృష్ట్యా సినిమాను తాత్కాలికంగా తొలగించాము, త్వరలోనే తిరిగి అందుబాటులోకి తెస్తాం" అని పేర్కొంది. అయితే ఈ సినిమా ఇపుడు భారతదేశంలో అందుబాటులో లేనప్పటికీ, ఇతర దేశాల్లో (ZEE5 Global) ఇంకా స్ట్రీమింగ్ అవుతున్నట్లు తెలుస్తోంది. కాగా, సినిమా చూస్తున్న మధ్యలోనే ఒక్కసారిగా స్ట్రీమింగ్ స్టాప్ అవ్వడంతో చాలా మంది వ్యూయర్స్ సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు.

Next Story