- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PSBs: ప్రభుత్వానికి రూ.7,023 కోట్ల భారీ డివిడెండ్
ప్రభుత్వమే ఈ బ్యాంకుల్లో ప్రధాన వాటాదారు కావడంతో, ఈ డివిడెండ్ నేరుగా కేంద్ర ఖజానాకు చేరనుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగంలోని మూడు ప్రధాన బ్యాంకులు కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), ఇండియన్ బ్యాంక్ కేంద్ర ప్రభుత్వానికి భారీ డివిడెండ్ చెల్లించాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం రూ.7,023 కోట్ల డివిడెండ్‌ను చెల్లించినట్టు తెలుస్తోంది. ఇందులో కెనరా బ్యాంక్ అత్యధికంగా రూ.2,397 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.2,811 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ.1,815.05 కోట్ల డివిడెండ్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందజేశాయి. ప్రభుత్వమే ఈ బ్యాంకుల్లో ప్రధాన వాటాదారు కావడంతో, ఈ డివిడెండ్ నేరుగా కేంద్ర ఖజానాకు చేరనుంది. డివిడెండ్‌తో పాటు మూడు బ్యాంకులు సమీక్షించిన కాలంలో మెరుగైన ఆర్థిక పనితీరును సాధించాయి. కెనరా బ్యాంక్ ఒక్కో షేరుపై రూ.4.20 డివిడెండ్ ప్రకటించగా, బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక్కో షేరుకు రూ.8.50 డివిడెండ్ ప్రకటించింది. ఇండియన్ బ్యాంక్ కూడా స్థిరమైన వ్యాపార వృద్ధి, మెరుగైన ఆస్తుల నాణ్యత, సమర్థవంతమైన నిర్వహణతో ముందుకు సాగుతున్నట్లు తెలిపింది. ఈ డివిడెండ్ చెల్లింపులు ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభదాయకత బలోపేతం కావడం, ప్రభుత్వానికి స్థిరమైన ఆదాయ వనరుగా మారుతున్నాయనే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాయి.






