Adani Group: రూ.2,500 కోట్ల అదానీ డిఫెన్స్ ప్లాంట్‌కు శంకుస్థాపన

by S Gopi |

ప్రధాని మోడీ ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ ఆశయాలకు అనుగుణంగా, విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించి స్వదేశీ ఆయుధ సంపత్తిని పెంచడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని అదానీ గ్రూప్ వెల్లడించింది.

Adani Group: రూ.2,500 కోట్ల అదానీ డిఫెన్స్ ప్లాంట్‌కు శంకుస్థాపన
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత రక్షణ రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో రూ. 2,500 కోట్ల అంచనా వ్యయంతో అదానీ గ్రూప్‌నకు చెందిన 'అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్' అత్యాధునిక రక్షణ ఉత్పాదక ప్లాంట్‌ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ ప్లాంట్‌లో మధ్యస్థ, సుదూర శ్రేణి క్షిపణి వ్యవస్థలు (మిస్సైల్స్), కాంపోజిట్ ప్రొపెల్లెంట్స్, టీఎన్‌టీ లాంటి ఆధునిక పేలుడు పదార్థాలను తయారు చేయనున్నారు. ప్రధాని మోడీ ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ ఆశయాలకు అనుగుణంగా, విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించి స్వదేశీ ఆయుధ సంపత్తిని పెంచడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని అదానీ గ్రూప్ వెల్లడించింది. రాబోయే మూడేళ్లలో అందుబాటులోకి రానున్న ఈ ప్లాంట్ ద్వారా దాదాపు 5,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించడమే కాకుండా, సప్లై చైన్ ద్వారా 50కి పైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) భాగస్వామ్యం కానున్నాయి. రక్షణ రంగంలో కేవలం విడిభాగాలను అసెంబుల్ చేయడమే కాకుండా, పూర్తి స్థాయి సాంకేతికతతో ఆయుధాలను తయారు చేయడమే తమ లక్ష్యమని అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ డైరెక్టర్ జీత్ అదానీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటికే గ్వాలియర్‌లో ఉన్న అదానీ డిఫెన్స్ కాంప్లెక్స్ ద్వారా లైట్ మెషిన్ గన్స్ (ఎల్ఎంజీ), అసాల్ట్ రైఫిల్స్, కార్బైన్‌లను విజయవంతంగా తయారు చేస్తున్నామని.. ఆర్మీకి షెడ్యూల్ కంటే 11 నెలల ముందే 2,000 ఎల్‌ఎమ్‌జీలను అందించినట్లు ఆయన పేర్కొన్నారు.

Next Story