- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర రోడ్డుప్రమాదం.. ఏఎస్సై దుర్మరణం
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నంద్యాల - కర్నూలు జాతీయ రహదారిపై పాణ్యం మండలం తమ్మరాజుపల్లె సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఏఎస్సై సురేశ్ రెడ్డి దుర్మరణం చెందారు.

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నంద్యాల - కర్నూలు జాతీయ రహదారిపై పాణ్యం మండలం తమ్మరాజుపల్లె సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఏఎస్సై సురేశ్ రెడ్డి దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సురేశ్ రెడ్డి ఆళ్లగడ్డ రూరల్ పీఎస్ లో అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. ఆయన మరికొందరితో కలిసి అనంతపురంలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా.. వారు ప్రయాణిస్తున్న క్రెటా కారు ఉన్నట్లుండి పేలిపోయింది. దీంతో డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోగా.. అది కాస్తా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సురేశ్ రెడ్డి స్పాట్ లో మృతి చెందగా.. ఎస్ బీ కానిస్టేబుల్ నాగేంద్ర ప్రసాద్ రెడ్డి, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలో ఉన్న శాంతిరామ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పాణ్యం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు టైరు పేలడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా భావిస్తున్నట్లు తెలిపారు.






